Komatireddy Venkat Reddy: సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాలు కలపడం సాధ్యం కాదని, వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. నల్లగొండ జిల్లాలో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు మెడికల్ విద్యార్థులకు 75వేల ఆర్థిక సహాయం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంబీబీఎస్ పూర్తయ్య వరకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నల్లగొండ నియోజకవర్గం నుండి ఇప్పటికి ఏ కష్టం వచ్చినా నాకే బాధితులు, స్థానికులు ఫోన్ చేస్తున్నారు.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్న అండగా ఉంటా అన్నారు. రైతులు సాగునీటి కష్టాలు కూడా నా దృష్టికి తీసుకువస్తున్నారు వాటినీ పరిష్కరిచానన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి రెగులర్ గా వస్తాను, అందుబాటులో ఉంటానని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీస్ లు కడుతున్నారని తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ భవనాలునా హయాంలోనే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.
Read also: Nadendla Manohar : జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసింది
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా.. ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మరవను, వారికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. సీఎం దత్తత తీసుకున్న నల్లగొండ నియోజకవర్గంలో ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం జరగడంలేదన్నారు. వెంటనే డబల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు డ్రా తీసి ఇవ్వాని, TRS వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీలో హై పవర్ కమిటీలు చాలా వున్నాయని, మంత్రి పదవికే రాజీనామా చేశా? నాకు పదవులు ముఖ్యం కాదన్నారు. పేదలు, కార్యకర్తలు నాకు ముఖ్యమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడను, ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలు మాట్లాడతా అంటూ తెలిపారు. అయితే ఉమ్మడి రాష్ట్రంపై సజ్జల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి ఆయన మాటలు సరైనవి కాదంటూ కొట్టిపారేశారు.
Read also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్ ముహుర్తం ఫోటోలు
అయితే తాజాగా.. రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీలైతే ఏపీని మళ్లీ కలపడమే తమ పార్టీ విధానమని, రెండు రాష్ట్రాల విలీనాన్ని ముందుగా స్వాగతించేది వైసీపీయేనని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడు కాదని, ఎప్పుడైనా సమైక్య రాష్ట్రానికి ఓటేస్తానని, ఏ వేదికపైనైనా అదే చెబుతానని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం, పార్టీ వైఖరి ఇదేనంటూ సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Komatireddy Venkat Reddy: సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!