ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాలు కలపడం సాధ్యం కాదని, వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. నల్లగొండ జిల్లాలో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు మెడికల్ విద్యార్థులకు 75వేల ఆర్థిక సహాయం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంబీబీఎస్ పూర్తయ్య వరకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది. ఈ రెండు కమిటీల్లో పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.
తెలంగాణలో రెండో రోజు భారత్ జూడో యాత్ర కొనసాగుతుంది. జూడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. కాసేపు సరదాగా సాగింది. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. టీ.కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్ అవుతున్నారు.