Kodanda Reddy : 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడన్నారు. కేసీఆర్ సర్కార్ రైతు కష్టాలను పట్టించుకోలేదని, కరోనా సమయంలో కూడా రైతులు నిరంతరం పనిచేశారన్నారు. రైతులకు కరోనా కష్టాలు వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ సంవత్సరం ప్రభుత్వం వడ్లు కొనక రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫి హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. 7095 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు అంకెల గారడీకే పరిమితం అయ్యాయన్నారు.
Also Read : Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలకి చెక్ పెట్టే గొప్ప ఔషధం
భూ రికార్డ్‌ల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలం అయిందని, ధరణి పోర్టల్‌తో భూస్వాములకు న్యాయం జరిగిందన్నారు. చిన్నా సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని, వ్యవసాయం చేయని భూములకు కూడా రైటుబంధు సాయం అందుతోందన్నారు. పంట నష్ట పరిహారం అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఎంతో మంది ఆదివాసీలను పోలీసులు జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ ఇప్పుడు దేశంలో ఏదో చేస్తానని చెబుతున్నాడని, ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. కేసీఆర్ జాతీయ పార్టీ ఒక అత్యాశ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!