ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి.. రోగనిరోధక శక్తిని పెంచి, తీవ్రమైన వ్యాధులను నయం చేస్తాయి.
ఈ ఫ్రూట్‌లోని బీటాసియానిన్స్, పోలీఫెనోల్స్.. బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, పేగు సమస్యలను నియంత్రిస్తాయి.
గింజల్లో ఉండే ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్.. కొలెస్టిరాల్ స్థాయిలని అదుపులో ఉంచి, గుండె కణాల్ని బలపరుస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, గట్ యొక్క ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఈ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, బీటాసినిన్స్ వంటివి.. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్.. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే మెగ్నీషియం, కాల్షియం.. శరీరంలోని ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ జుట్టుకి కూడా ఎంతో ఉపయోగకరం. జుట్టుని నల్లగా, మృదువుగా మెరిసేలా చేస్తుంది.
ఈ ఫ్రూట్ కంటికి కూడా చాలా మంచిది. కంటి సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.