తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు విషయం పై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి మడో సారి లేఖ రాసారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విసయం పై అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ డిసెంబర్ 2021లో మొదటి లేఖను రాశానని పేర్కొన్నారు. సీఎం స్పందించికపోవడంతో.. మళ్లీ ఫిబ్రవరి 22న 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై లేఖ రాసానని పేర్కొన్నారు. అయినా కూడా తెలంగాన ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడంతో.. మే 02.2022లో ఈ విషయం ప్రస్తావిస్తూ మళ్లీ లేఖ రాసానని గుర్తు చేసారు.
read also: IndiGo: మరోసారి విమాన ప్రమాదం.. రన్ వే నుంచి జారిపోయిన ఇండిగో ఫ్లైట్
సైన్స్ సీటీ ఏర్పాటును సంబంధించిన డీపీఆర్ ను రూపొందించటంలో తెలంగాన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సాంకేతిక సహాయం అవసరమైతే.. డైరెక్టర్ జనరల్, ఎన్‌ఎస్‌ఎం కలకత్తా వారిని తెలియజేసానన్నారు. ఈవిధంగా సీఎంకు మూడు సార్లు లేఖలు వ్రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం గారు మీ దగ్గర నుంచి స్పందన రావాలని మళ్లీ ఈ విషయం ప్రస్తావిస్తూ లేఖ రాస్తున్నానని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొంటు సీఎం కు లేఖ రాసారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులలో, యువతలో సైన్స్ పట్ల ఎంతో ఆసక్తిని పెంపొందించే ఈ సైన్స్ సిటీని హైదరాబాద్ నగరం నందు ఏర్పాటు చేసినట్లయితే పర్యాటకంగా కూడా నగరానికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. సైన్స్ కు సంబంధించి ఇక్కడ ప్రదర్శించే ఎన్నో ఆవిష్కరణలు ఎంతో మంది విద్యార్థులను ప్రేరేపించి, వారికి నూతన పరిశోధనలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది.
CCMB, IICT, CFSL, CDFD, NGRI, NIN, INCOIS, IIIT, DMRL వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, శాస్త్రీయ సంస్థలు, IT కి చెందిన అనేక అంతర్జాతీయ సంస్థల పరిశోధన & అభివృద్ధి కేంద్రాలు ఉన్న హైదరాబాద్ నగరం సైన్స్ సిటీని ఏర్పాటు చేయటానికి కావలసిన అన్ని రకాల అర్హతలను కలిగి ఉంది. ఇప్పటికే దేశంలో ఉన్న కలకత్తా, బెంగుళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులు, యువత వారి కుటుంబ సభ్యులు, పర్యాటకులు సందర్శించి సైన్స్ పట్ల ఎంతో ప్రేరణను పొందుతున్నారు, పరిశోధనలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నాలుగు సైన్స్ సిటీల తర్వాత తదుపరి సైన్స్ సిటీని ఏర్పాటు చేసే అవకాశం మన హైదరాబాద్ నగరానికే లభించడం చాలా సంతోషదాయకమైన విషయం.
కాబట్టి, ఈ విషయంలో మీరు వ్యక్తిగత చొరవ చూపించి, ఇకపై ఎటువంటి ఆలస్యం జరగకుండా హైదరాబాద్ నగరం నందు సైన్స్ సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన 25 ఎకరాల భూమితో పాటు, కావలసిన DPR SPOCS మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేత వెంటనే తయారు చేయించి పంపగలరని, తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు సైన్స్ సిటీని చేరువ చేయగలరని ఆకాంక్షిస్తున్నాను అంటూ పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఈసారైనా కిషన్ రెడ్డి లేఖకు సీఎం స్పందిస్తారా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
IndiGo: మరోసారి విమాన ప్రమాదం.. రన్ వే నుంచి జారిపోయిన ఇండిగో ఫ్లైట్