Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ నెల 2న కూడా కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3వ తేదీన నిజామాబాద్‌లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరతానని బీఆర్‌ఎస్ తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఈసీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఈ నెల 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన వరాలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా హామీ రాసుకున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!