కిన్నెర మొగులయ్య ఇప్పుడు పద్మశ్రీ మొగిలయ్యగా మారారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి పరిచయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. మొగిలయ్య స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. తన దగ్గర ఈ కళ తప్ప ఏం లేదంటున్నారు మొగులయ్య. ఎన్టీవీ ఎక్ప్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన అంతరంగం ఏమిటో చూద్దాం.