కిన్నెర మొగులయ్య ఇప్పుడు పద్మశ్రీ మొగిలయ్యగా మారారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి పరిచయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. మొగిలయ్య స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. తన దగ్గర ఈ కళ తప్ప ఏం లేదంటున్నారు మొగులయ్య. ఎన్టీవీ ఎక్ప్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన అంతరంగం…
ప్రముఖ గాయకుడు కిన్నెర మొగులయ్యను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించాడు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని… పాట పాడినందుకు గానూ… కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించాడు. ఆర్టీసీని కిన్నెర మొగులయ్య ప్రమోట్ చేస్తూ.. పాట పాడటం చాలా మంచి విషయమని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయితే.. గత రెండు రోజుల కింద కిన్నెర మొగులయ్య ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితంటూ పాట పాడాడు. ఆ పాట రెండు రోజుల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట విశేష ఆదరణ పొందింది. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కనిపిస్తాడు. ఆడాగాదు ఈడాగాదు… అమీరోళ్ల మేడాగాదుగుర్రం నీళ్ల గుట్టాకాడ… అలుగూ వాగు తాండాలోనబెమ్మా…