Ministers Tummala: నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు వల్లే మున్నేరు వరద ముంపు గండం ఏర్పడిందని మంత్రి తమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలో మామిళ్ళ గూడెం, సారథి నగర్ కాలనీలను అనుసంధానం చేసే రైల్వే అండర్ మినీ బ్రిడ్జిను మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు వల్లే మున్నేరు వరద ముంపు అని తెలిపారు. అడవులను కొట్టడం వల్లే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని మంత్రి అన్నారు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు.
Read also: Elon Musk: ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?
ఎమ్మెల్యేగా ఉన్నపుడు అనుమతి వచ్చిందని, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజా పాలన ఏడాదిలో ఆర్‌యూబీ ప్రారంభోత్సవం చేశామన్నారు. ఖమ్మం నగరంలో విశాలమైన రహదారులు పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 500 ఎకరాలు ఉన్న వెలుగుమట్ల పార్క్ ను ఖమ్మం నగరానికి పర్యాటక ప్రదేశంగా ల్యాండ్ మార్క్ గా అభివృద్ధి చెందేలా చేశామన్నారు. ఖమ్మం చరిత్ర తెలిపే ఖిల్లాపై రోప్ వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందిందని తెలిపారు.
Read also: Sai Kiran : ‘నువ్వే కావాలి’ అంటూ నటిని పెళ్లాడనున్న సీరియల్ నటుడు
పెరుగుతున్న అర్బన్ పాపులేషన్ కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఖమ్మం విప్లవాలు పురిటిగడ్డ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో నైజాం రజాకార్లను తరిమి కొట్టిన జిల్లా అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నాకు అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజానీకంకు ధన్యవాదాలు తెలిపారు.
Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్