Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..
- కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది..
- అన్ని పంటలను బోనస్ ఇస్తాం అన్నారు... అది కాస్తా బోగస్ గా మారింది..
- ఖమ్మం మార్కెట్ లో ఇప్పటి వరకు మద్దతు ధర రాలేదు..
- అకాల వర్షాలు, చీడపీడలతో తీవ్రంగా నష్టపోయారు రైతులు..
- కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం అమ్మకాలపై రివ్యూ చేయడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎక్కడెక్కడ తక్కువ మందు అమ్ముతున్నారు అని దానిపై మాత్రమే రివ్యూలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఎన్నికల ముందు బోనస్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానం అంతా బోగస్ గా మారి పోయిందని హరీష్ రావు సెటైర్స్ వేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ని సందర్శించారు. అక్కడ పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
Read also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
రాష్ట్రంలో పత్తి రైతులు పెట్టుబడిన రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సీజన్లో కింటా పత్తికి 6000- 6500 మధ్య మాత్రమే వచ్చిందన్నారు. ఎంఎస్పి 7500 ఉంటే ఆ ధర ఎందుకు రైతుకు పలకడం లేదన్నారు. తేమశాతాన్ని ఇనాం ద్వారా చూడండి రైతుకు మద్దతు ధర ఇవ్వండి అని అన్నారు. కాంగ్రెస్ ప్రాధాన్యత మొత్తం కూడా మద్యం అమ్మకాలపైనే ఉంది కానీ రైతులపై లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని తాగించేందుకు ఎక్కడెక్కడ తక్కువగా తాగుతున్నారు రివ్యూలు మీటింగులు చేసి తెలుసుకుంటున్నారు అని మండిపడ్డారు. కానీ వడ్లు పత్తి మద్దతు ధరలపై ఎటువంటి రివ్యూ మీటింగ్ లో చేసే తీరిక లేదని విమర్శించారు. పత్తిని సిసిఐ కేంద్రాలు కొన్నది చాలా తక్కువగా ఉన్నదని, వ్యాపారులకు ఉన్నది ఎక్కువగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టమన్న సీసీఐ కేంద్రాలు ఎక్కడ ఎటుపోయాయని ప్రశ్నించారు.
Read also: Adilabad: పోలీసుల అదుపులో తుపాకులు సరఫరా చేసే ముఠా..!
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బ్రహ్మాండంగా మాటలు చెబుతున్నారు కానీ, చేతల్లో లేదు అని హరీష్ రావు అన్నార. ఆంధ్రా నుంచి వచ్చిన దళారులు వడ్లు కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 19 మెట్రిక్ టన్నులు వడ్లు కొనుగోలు చేసింది వారికి బోనస్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కానీ ఆ బోనస్ అంతా కూడా ఇప్పుడు బోగస్ గా మారిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఒకరిపై ఒకరు పై చేయి సాధించటం కోసం పోటీలు పడుతున్నారు తప్ప ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పండించిన అన్ని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!