Congress: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్ గాంధీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు. ఈ సభ వేదికగా ప్రసంగించనున్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించే ఛాన్స్ ఉంది. రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.
Read Also: Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో.. పొరుగున ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇక, ఆ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణలో వేగంగా పావులు కదుపుతుంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనకు తెరపడుతుందని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే, తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. రాహుల్ గాంధీజీ హాజరయ్యే సభను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అత్తాపూర్‌లో పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య
ఇప్పటికే ఖమ్మం నగరంతో పాటు.. నగరానికి వచ్చే పలు మార్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. సభ వేదిక స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్‌ను కూడా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Read Also: Ileana D’cruz Pregnancy: ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఇతడే.. ఫోటో పెట్టిందోచ్
ఖమ్మంలో జనగర్జన సభకు వస్తున్న రాహుల్ గాంధీ.. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు వస్తారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ సభావేదికపైకి రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 1,360 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు.
Read Also: CM KCR: గోదావరి పరివాహక ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ
దీంతో పాటు అదే వేదికపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు, ఇతర నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఇక, ఈ సభ అనంతరం రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!