Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిలిప్పీన్ లో అక్షయ్ ఎంబిబిఎస్ చదువుకుంటున్నాడు. బైక్ పై వెళ్తున్న అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్షయ్ కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6 నెలల్లో ఎంబిబిఎస్ పట్టా అందుకొనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అక్షయ్ మృతితో తన స్వగ్రామం అయిన వేల్పూరు లో విషాదం నెలకొంది.
Read also: South Telangana Project: నేడు పెండింగ్ ప్రాజెక్ట్ లపై మంత్రుల సమీక్ష..
కెనడా నుంచి ప్రణీత్ మృత దేహం..
ఈనెల 15 న కెనడా టొరంటో లో పుట్టినరోజునే చెరువులో మునిగి ప్రణీత్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రణీత్ మృత దేహాన్ని హైదరాబాద్ తెప్పించాలని తల్లిదండ్రులు కోరారు. దీంతో ఈనెల 23 న హైదరాబాద్ కు ప్రణీత్ మృతదేహాన్ని తీసుకురానున్నారు. ఈనెల 22 మధ్యాహ్నానికే ప్రణీత్ కెనడా నుండి ఢిల్లీకి డెడ్ బాడీ రానుంది. అయితే ఢిల్లీ నుండి హైదరాబాద్ కు మృతదేహం 30 గంటల ఆలస్యంగా చేరనుంది. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు మృతదేహాన్ని 22 నే తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రణీత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Phone Tapping Case: ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసులు..