Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో మెచ్చా నాగేశ్వరరావు ఒకరు. అశ్వారావుపేటలో సైకిల్ గుర్తుపై గెలిచినా తర్వాత కండువా మార్చేశారు. అధికారపార్టీకి జైకొట్టారు మెచ్చా. ఆయన గులాబీ కండువా కప్పుకొన్నప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కేడర్ మింగిల్ కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకు కొత్త సమస్య సవాల్ విసురుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసమ్మతి బాట పట్టడంతో ఆ ప్రభావం అశ్వారాపుపేటలోనూ కనిపిస్తోంది. ఎమ్మెల్యే మెచ్చా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ…