KCR : జీవన్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి BRS లోకి ఆహ్వానించిన కేసీఆర్
- జీవన్ రెడ్డి BRS లోకి ఎంట్రీ
- కేసీఆర్ సమక్షంలో ఘన స్వాగతం
- జగిత్యాలలో భారీ సభ
- కేటీఆర్ గైర్హాజరు చర్చనీయాంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి అధికారికంగా బీఆర్ఎస్ (BRS) గూటికి చేరారు. జగిత్యాలలో నిర్వహించిన భారీ ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జగిత్యాల పార్టీ కార్యాలయం నుండి కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో సభా ప్రాంగణానికి బయలుదేరారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. స్టేజ్ పైకి రాగానే కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేయడంతో సభా ప్రాంగణం అంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిపోయింది.
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరడం జిల్లా రాజకీయాల్లో పెను మార్పుగా భావిస్తున్నారు. జీవన్ రెడ్డి అనుభవం పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని, జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ మరింత పటిష్టం అవుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలకమైన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, దీనికి గల కారణాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన జగిత్యాల పర్యటనలో భాగంగా తీవ్రమైన ఎండల వల్ల కేటీఆర్ వడదెబ్బకు గురయ్యారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటుండటంతో నేటి సభకు రాలేకపోయినట్లు సమాచారం. వేదికపై నుండి కేసీఆర్ ప్రజలకు , కార్యకర్తలకు ప్రత్యేకంగా అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. జీవన్ రెడ్డి చేరిక నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతలను కలుపుకుపోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సంకేతాలిచ్చారు.
TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!