KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
- ఆశపడితే మోసం చేశారు
- బీఆర్ఎస్ కేవలం 1.7శాతం తేడాతో ఓడింది...
- రియల్ ఎస్టేట్ పడిపోయింది
- రైతులకి ఇస్తామన్న బోనస్ బోగస్ అయింది : కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ కోల్పోయామని బాధపడుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. “కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైనా చేస్తారని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. కానీ, వీళ్లు ఒక్కటంటే ఒక్కటైనా నిర్మాణాత్మకమైన పని చేశారా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఆశపడి ఓటేస్తే, కాంగ్రెస్ వారిని నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.
Supreme Court: ఉచిత పథకాలపై కేసు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
రైతుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “దుకాణాల్లో యూరియా లేదు కానీ యాప్‌లో వస్తుందట. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెడుతున్నారు. రైతుబంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలా? రైతులకు ఇస్తామన్న బోనస్ కాస్త ‘బోగస్’ అయింది. మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కు లేదు” అని ధ్వజమెత్తారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేసిందని ఆయన ఆరోపించారు.
హైడ్రా (HYDRAA) పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. “ఏమిటి ఈ కూల్చివేతలు? కనీసం పిల్లల పుస్తకాలు కూడా తీసుకోవనివ్వరా? మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట హైడ్రాను పీకి పారేసే ఫైలు మీదనే సంతకం చేస్తాను” అని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ పోయి ‘నిడ్రా’ తెస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “మేము ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీ ఇచ్చాము, కానీ వీళ్లు 7 శాతం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 12 వేల కోట్లకు చేరాయి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోయించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు” అని విమర్శించారు.తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక గందరగోళంలో ఉందని, ప్రజల పక్షాన నిలబడి ఈ ‘దరిద్రపు పాలన’పై పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?