KCR : కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ..!

  • మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగం
  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా
  • ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు
  • రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా
  • ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపా
  • ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం. -కేసీఆర్‌
Kcr

Kcr

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఎన్నో చారిత్రాత్మక వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఉద్యమ రచన చేసిన ఈ గదిలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు

మరోవైపు, ఈ విచారణ ప్రక్రియలో పోలీసులు అత్యంత కఠినమైన ఆంక్షలను అమలు చేశారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులందరినీ నివాసం నుంచి బయటకు పంపించివేశారు. నిబంధనల ప్రకారం కేసీఆర్ తరపు న్యాయవాదులకు కూడా విచారణ సమయంలో లోపల ఉండటానికి సిట్ అధికారులు అనుమతి నిరాకరించారు. నందినగర్ ప్రాంతమంతా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉంది.

T20 World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఆ అస్త్రాన్ని భారత్‌పై ప్రయోగించడం అసాధ్యం!