దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్…