Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పై కవిత కీలక వ్యాఖ్యలు
- బతుకమ్మపై గిన్నిస్ రికార్డు ప్రయత్నాలపై కవిత విమర్శలు
- బీసీ రిజర్వేషన్ల కేసులపై రేవంత్ రెడ్డి సన్నిహితులపై ఆరోపణలు
- ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై ఘాటు కామెంట్స్ చేసిన కవిత
- ఎస్సీ వర్గీకరణ, స్థానిక ఎన్నికలపై కవిత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha : బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బతుకమ్మ నిమజ్జనంలో సీఎం పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమేనని పేర్కొన్న కవిత, అయితే గిన్నిస్ రికార్డ్ కోసం బతుకమ్మను వాడుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం పది వేల మంది మహిళలతో బతుకమ్మ నిర్వహించి అవమాన పరిచారని ఆరోపించారు.
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
వచ్చే సంవత్సరం లక్ష మంది మహిళలతో బతుకమ్మ జరిపి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదిస్తామని కవిత ప్రకటించారు. బీసీ కులగణన చేపట్టినప్పుడు తప్పు అన్నారు, కానీ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చిన వెంటనే కేసులు వేశారని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఈ కేసులు వేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై కూడా కవిత ఘాటు కామెంట్స్ చేశారు. “ఎవరూ పోటీ చేయొద్దంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతవేనా? లేక బీజేపీ పార్టీ స్టాండ్‌నా?” అని ప్రశ్నించారు.
మహారాష్ట్రలా ఎన్నికలు రద్దవుతాయని ఈటెల చెప్పడం కోర్టులను ప్రభావితం చేసే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినప్పటికీ, వర్గీకరణ వారీగా రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత వ్యాఖ్యానించారు. ఈ నెల 8న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మా కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో ఇంకా క్లారిటీ లేదని, పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులను ప్రభుత్వం చేపట్టడం స్వాగతించదగ్గదని పేర్కొన్నారు. బీసీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఉద్యమం చేస్తే మంచిదని సూచించారు.
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!