Site icon NTV Telugu

Kavita New Party : కవిత కొత్త పార్టీ: తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?

Kavitha

Kavitha

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది.

India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

రాబోయే నెలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండా , పార్టీ గుర్తును (సింబల్) ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పార్టీ ప్రకటనకే పరిమితం కాకుండా, కవిత రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండటంతో, అదే పార్లమెంట్ పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..

కవిత ఈ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వంటి నేతలు కవిత నిర్ణయంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కవిత వెంట ఎంతమంది కీలక నేతలు నడుస్తారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆమె పార్టీలో చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో వస్తున్న ఈ కొత్త పార్టీ, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.

Exit mobile version