Kavita New Party : కవిత కొత్త పార్టీ: తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?
- నిజామాబాద్‌లో కొత్త పార్టీ ప్రకటనకు కవిత సిద్ధం
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా రాజకీయాల్లో కొత్త అడుగు
- బోధన్ నుంచి పోటీపై చర్చలు జోరుగా
- మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా కొత్త పార్టీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది.
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
రాబోయే నెలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండా , పార్టీ గుర్తును (సింబల్) ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పార్టీ ప్రకటనకే పరిమితం కాకుండా, కవిత రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండటంతో, అదే పార్లమెంట్ పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
కవిత ఈ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వంటి నేతలు కవిత నిర్ణయంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కవిత వెంట ఎంతమంది కీలక నేతలు నడుస్తారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆమె పార్టీలో చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో వస్తున్న ఈ కొత్త పార్టీ, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!