Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం..
- 17 వేల మంది డ్రైవర్ల తొలగింపు..
- ఇంగ్లీష్ రాదనే కారణంతోనే ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ట్రక్ డ్రైవర్ల నియమ నిబంధనల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ (Sean Duffy) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంగ్లీష్ భాషా నైపుణ్య పరీక్షలో విఫలమైన వేలాది మంది విదేశీ ట్రక్ డ్రైవర్లను రోడ్లపై నుంచి తొలగించారు.
17,000 లైసెన్సుల రద్దు..
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
గతంలో ఒబామా హయాంలో ఉన్న కొన్ని సడలింపులను రద్దు చేస్తూ.. ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన సుమారు 17,000 కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను (CDL) అధికారులు రద్దు చేశారు. రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సంకేతాలను చదవలేకపోయినా, అధికారులతో ఇంగ్లీష్‌లో సంభాషించలేకపోయినా అటువంటి డ్రైవర్లను ‘అన్‌క్వాలిఫైడ్’గా పరిగణించి వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నారు. కేవలం గత కొన్ని నెలల్లోనే దాదాపు 9,500 నుండి 12,000 మంది డ్రైవర్లను నేరుగా రోడ్డు తనిఖీల సమయంలోనే పక్కన పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Also Read:Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…
ఈ చర్యలపై సీన్ డఫీ స్పందిస్తూ.. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, అమెరికన్ల ప్రాణాలను కాపాడే భద్రతా చర్య అని పేర్కొన్నారు. ‘80,000 పౌండ్ల బరువున్న భారీ ట్రక్కులను నడిపే వారు ట్రాఫిక్ సైన్ బోర్డులను అర్థం చేసుకోలేకపోతే అది పెను ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రమాదకరమైన, అర్హత లేని విదేశీ డ్రైవర్లను రోడ్లపై నుంచి పూర్తిగా తొలగించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘోర రోడ్డు ప్రమాదాల్లో విదేశీ డ్రైవర్ల ప్రమేయం ఉండటమే ఈ కఠిన నిర్ణయాలకు ప్రధాన కారణమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారత్ (పంజాబ్), మెక్సికో, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన మత్స్యకారులు, డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే 550కి పైగా డ్రైవింగ్ స్కూళ్లను నిబంధనలు పాటించలేదనే కారణంతో మూసివేశారు. అయితే.. ఈ నిబంధనలు వలసదారులను లక్ష్యంగా చేసుకున్నాయని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ‘అమెరికా ఫస్ట్ – సేఫ్టీ ఫస్ట్’ నినాదంతో ముందుకు వెళ్తోంది.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!