Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
- ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే లేఖ
- వివరణకు ఆరు వారాల సమయం కోరిన కౌశిక్
- పూర్తి వీడియో ఫుటేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి
- అసెంబ్లీ సమావేశాల తర్వాత గడువు ఇవ్వాలని అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padi Kaushik Roddy : శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి తన పూర్తి వివరణ సమర్పించడానికి ఆరు వారాల సమయం కావాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఆగస్టు 31న తనకు ఎథిక్స్ కమిటీ నోటీసు అందిందని, సెప్టెంబర్ 5 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కమిటీ తనకు అందించిన మెటీరియల్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందని, దానిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే పూర్తి వివరణ ఇవ్వగలనని స్పష్టం చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున, ఈ బిజీ షెడ్యూల్ కారణంగా తనకు తగినంత సమయం అవసరమని తెలిపారు.
పూర్తి వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి
మార్చి 29న జరిగిన ఘటనకు సంబంధించిన నాటి వీడియో క్లిప్ అసంపూర్తిగా ఉందని కౌశిక్ రెడ్డి లేఖలో వ్యాఖ్యానించారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజ్‌ను తనకు అందించాలని కోరారు. ముఖ్యంగా ట్రెజరీ బెంచ్ (పాలకపక్షం) , ప్రతిపక్షాల మధ్య జరిగిన సంభాషణల ఆధారాలను, అలాగే ప్రతిపక్షం వైపు నుండి ట్రెజరీ బెంచ్ వైపు కెమెరా చిత్రీకరించిన పూర్తి వీడియోను తనకు ఇవ్వాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిష్పాక్షికమైన వివరణ ఇవ్వడం సాధ్యమవుతుందని అన్నారు. పూర్తి మెటీరియల్ పరిశీలనకు ఆరు వారాల గడువు ఇవ్వాలని కోరిన కౌశిక్ రెడ్డి, ఒకవేళ అది వీలుకాని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాతైనా తనకు గడువు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని ఎథిక్స్ కమిటీని అభ్యర్థించారు.
Also Read
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!