Minister KTR: కేటీఆర్‌తో కసిరెడ్డి, జైపాల్ భేటీ.. ఆసక్తికరంగా మారిన సమావేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: పాలమూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భేటీ అయ్యారు. కసిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డిల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు మళ్లీ టిక్కెట్ కేటాయించింది. కసిరెడ్డి కూడా పార్టీ నుంచి కల్వకుర్తి టికెట్ ఆశించారు.
కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ ను జైపాల్ యాదవ్ తో కలిసి కసిరెడ్డి కలిశారు. ఇరువురు నేతల మధ్య విభేదాలను ప్రస్తావించినట్లు సమాచారం. వారిద్దరి గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని, ఎవరూ తొందరపడవద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను విడివిడిగా కలిశామని ఎమ్మెల్సీ కసిరెడ్డి చెబుతుండగా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం ఇద్దరూ కలిసి కేటీఆర్‌ను కలిశారని, సమస్య పరిష్కారమైందని అంటున్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్‌తో చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. 2018లోనే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నారాయణరెడ్డి ప్రయత్నించారు. జైపాల్ యాదవ్ కు బీఆర్ ఎస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా కొనసాగించారు. 2021లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డికి అవకాశం కల్పించిన బీఆర్ఎస్.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నా.. ఆయనకు అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్న తరుణంలో కేటీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. కసిరెడ్డి చేరికకు బ్రేక్ పడిందా అనే చర్చ సాగుతోంది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకర్తి నుంచి బీఆర్ ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. పైగా ఆయనకు కల్వకుర్తి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో ఆయన భేటీ కావడం ఈ వార్తలకు ఊతం ఇస్తోంది.
Atrocious: ఇంత దారుణమా.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!