Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య మేము నిర్ణయాలు చేయడం లేదని, మాది ప్రజా ప్రభుత్వమని ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేంద్రం తో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెట్టిందన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి అవినీతి లాంటి అనేక విధ్వంసమ్ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నామ మాత్రంగా కూడా మిగలదు… పేకమేడలా కూలిపోతుంది… వారే కూల్చుకుంటున్నారని తెలిపారు.
Read also: Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రి గా కాస్త ఆలస్యంగా వచ్చాను..
ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పి లోపల అప్పులు చేసిందన్నారు. కేంద్రం నుండి సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి నిధులు అడగలేదని అన్నారు. గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ పథకం నీళ్లు ఇంకా 30 శాతం మందికి చేరలేదన్నారు. వేలాది కోట్ల ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారన్నారు. నాలుగు గోడల మధ్య మేము నిర్ణయాలు చేయడం లేదు మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామన్నారు. బిసి జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఇంకా చంపాలని అనుకోవడం లేదు… కానీ వారు చేసిన పాపాలను దిగమింగుకోలేక చెప్పాల్సి వస్తుందన్నారు. ధరణి పేరుతో దోచుకున్నారు… ధరణి చట్టాన్ని సవరించబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అంటాం… చెడును మాత్రమే చెప్పమని తెలిపారు.
Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..