KTR: నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నారు. అయితే.. ఈ సభకు కేటీఆర్ హాజరు కాలేరని తెలుస్తుంది. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ తెలిపినట్లు గులాబీ వర్గాలు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో కేటీఆర్ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందున కరీంనగర్ సభకు హాజరు కారని తెలుస్తుంది.
Read also: Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
ఇవాళ సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు సమాచారం. కలిసొచ్చిన ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసభకు కేటీఆర్ హాజరుకాలేరని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంతటి భారీ బహిరంగ సభకు కేటీఆర్ డుమ్మా కొట్టడం ఏంటని? ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ సభలో కేసీఆర్ ప్రసంగం పై బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెరగనుందా? అనే ఆశక్తి నెలకొంది.
Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. సినిమా కోసమేనా?