ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. చరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు..
గతంలో ఓ హీరో చనిపోతాడు అని చెప్పాడు అలాగే హీరో తారకరత్న చనిపోయాడు.. ఇక సినిమాల విషయంలో కూడా ఈయన చెప్పినట్లే జరుగుతుండటంతో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.. అలాగే చాలా మంది హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకుంటే కేరీర్ దూసుకుపోతుందని నమ్ముతున్నారు.. ఈ క్రమంలోనే హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామితో పూజులు చేయించుకుని తన శిష్యురాలిగా మారిపోయింది. అదేవిధంగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామిని సంప్రదించి తనకు సంబంధించి కొన్ని పూజలు చేయించుకుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన లిస్ట్ లోకి అనన్య నాగళ్ళ కూడా వచ్చి చేరింది.. తాజాగా వేణు స్వామితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి జంటగా నటించిన సినిమా ‘తంత్ర’.. క్షుద్ర పూజల నేపథ్యంలోని కథతో ‘తంత్ర’ తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ సినిమా విజయం సాధించాలని వేణు స్వామి ఎటువంటి పూజలు చేశారో అని నెటిజనులు సరదాగా చర్చించుకుంటున్నారు.. ఈ సినిమా ఈనెల 15 న విడుదల కాబోతుంది..మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..