Kaushik Reddy: ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలని ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులు- కౌశిక్ రెడ్డి
- ఆరు గ్యారంటీలు అడిగితే మాపై కేసులు పెడుతున్నారు- కౌశిక్ రెడ్డి
- ఈ ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు- కౌశిక్ రెడ్డి
- రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారు- కౌశిక్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ- ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు అని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారు.. కేటీఆర్ టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ములా- ఈ తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ రూ.55 కోట్లు ఆఫిషియల్గా పంపామని చెప్పారు.. కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రోసీజర్ లాప్స్ లేదు.. ఒకవేళ ప్రోసిజర్ లాప్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Viral Video: ఎంత తింటావ్ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది.. ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులని అరెస్టు చేసి దోచుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోట్లాది రూపాయలకి అమ్ముడుపోయాడు.. కాబట్టి నీది ఏ పార్టీ అని అడిగాను.. మా బట్టలు ఇప్పుతానని అంటే ఊరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డుమెంబర్ గా కూడ గెలవడని విమర్శించారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో మంత్రుల ఆదేశాల మేరకు అందరూ ఎమ్మెల్యేలు తనను బెదిరించారన్నారు. రేవంత్ రెడ్డి డీకే అరుణని గతంలో తిట్టలేదా..? జూపల్లి కృష్ణారావుని నాడు నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ మీద కేసు పెట్టలేదా..? అని ప్రశ్నించారు.
Read Also: Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే తన మీద దాడి చేశాడని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. హైడ్రా అనేది దందా కోసం పెట్టారు.. తన మీద 28 కేసులు పెట్టారు.. ఇవన్నీ ప్రజల కోసం ప్రశ్నిస్తే పెట్టినవేనని అన్నారు. పీడీ యాక్ట్ పెడతామని అంటున్నారు.. తన మీద పీడీ యాక్ట్ పెట్టే ముందు 89 కేసులున్న రేవంత్ మీద పెట్టాలని పేర్కొన్నారు. పండగ పూట తనను అరెస్ట్ చేయడం తమ నేతల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను చేసిన క్రైమ్ ఏంటి.. తనను ఎందుకు అరెస్ట్ చేశారు.. ప్రజలు ఆలోచించాలన్నారు. కౌశిక్ రెడ్డి కేసులకు భయపడడు.. తాను సంజయ కుమార్ పై ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిని రేవంత్ రాళ్లతో కొట్టమన్నాడు.. తాను రాళ్లతో దాడి చేయలేదు.. ప్రశ్నించానని కౌశిక్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!