NTV Telugu Site icon

Kaushik Reddy: ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం

Mlc Kaushik Reddy

Mlc Kaushik Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు‌ అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ- ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు అని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారు.. కేటీఆర్ టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ములా- ఈ తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ రూ.55 కోట్లు ఆఫిషియల్‌గా పంపామని చెప్పారు.. కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రోసీజర్ లాప్స్ లేదు.. ఒకవేళ ప్రోసిజర్ లాప్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Viral Video: ఎంత తింటావ్‌ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది.. ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులని అరెస్టు చేసి దోచుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోట్లాది రూపాయలకి అమ్ముడుపోయాడు.. కాబట్టి నీది ఏ పార్టీ అని అడిగాను.. మా బట్టలు ఇప్పుతానని అంటే ఊరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డుమెంబర్ గా కూడ గెలవడని విమర్శించారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో‌ మంత్రుల ఆదేశాల మేరకు అందరూ ఎమ్మెల్యేలు తనను బెదిరించారన్నారు. రేవంత్ రెడ్డి డీకే అరుణని గతంలో తిట్టలేదా..? జూపల్లి కృష్ణారావుని నాడు నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ మీద కేసు పెట్టలేదా..? అని ప్రశ్నించారు.

Read Also: Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే తన మీద దాడి చేశాడని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. హైడ్రా అనేది దందా కోసం పెట్టారు.. తన మీద 28 కేసులు పెట్టారు.. ఇవన్నీ ప్రజల కోసం ప్రశ్నిస్తే పెట్టినవేనని అన్నారు. పీడీ యాక్ట్ పెడతామని అంటున్నారు.. తన మీద పీడీ యాక్ట్ పెట్టే ముందు 89 కేసులున్న రేవంత్ మీద పెట్టాలని పేర్కొన్నారు. పండగ పూట తనను అరెస్ట్ చేయడం తమ నేతల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను చేసిన క్రైమ్ ఏంటి.. తనను ఎందుకు అరెస్ట్ చేశారు.. ప్రజలు ఆలోచించాలన్నారు. కౌశిక్ రెడ్డి కేసులకు భయపడడు.. తాను సంజయ కుమార్ పై ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిని రేవంత్ రాళ్లతో కొట్టమన్నాడు.. తాను రాళ్లతో దాడి చేయలేదు.. ప్రశ్నించానని కౌశిక్ రెడ్డి తెలిపారు.

Show comments