Part Time Jobs: సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. జీతాలు సరిపోక ఎక్కువ శాతం యువత పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేయడం మంచిదని గృహిణులు కూడా ఆన్ లైన్ లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. స్మార్ట్ ఫోన్ , డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఆన్ లైన్ లోనూ అదే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. పార్ట్‌టైమ్ జాబ్ అంటూ ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు, లింక్‌లను ఫాలో అయితే మీ ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. టెక్నాలజీ సాయంతో సులువుగా మోసాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో కంటే ఈ సైబర్ కేసులు పెరిగాయి. నిరుద్యోగ యువత, గృహిణులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: No Airport Countries: ఆ దేశాల్లో విమానాశ్రయాలు లేవు. … అవును ఇది నిజం
కామారెడ్డి జిల్లాలో పార్ట్ టైం జాబ్ పేరిట సైబర్ మోసం కలకలం రేపుతుంది. సుమయ ఫిర్దోస్ అనే మహిళకు పార్ట్‌టైం జాబ్ కోసం సర్చ్ చేస్తుంది. అయితే సుమయకు పార్ట్‌టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ లో మెసేజ్ వచ్చింది. ఆనందంగా భావించిన సుమయ ఆ మెసేజ్ కు రిప్లై ఇచ్చింది. దీంతో అటు నుంచి డబ్బులు కట్టాలని మీరు కట్టిన డబ్బులకంటే ఎక్కువ రెట్టింపులో జీతం కూడా వస్తుందంటూ నమ్మించారు. సుమయా వారి మాటలకు నమ్మింది. గుర్తు తెలియని ఖాతాల్లో విడతల వారిగా డబ్బులు జమ చేయాలని కేటుగాళ్లు కోరడంతో జమ చేసింది. ఇలా విడదల వారిగా 1.13 లక్షల వరకు వేసింది. ఆతరువాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. మోసపోయనని భావించిన సుమయా ఫిర్దోస్ పోలీసులకు ఆశ్రయించింది. ఎక్కువ మొత్తంలో జమ చేసి మోసపోయానని బాధితురాలు సుమయా వాపోయింది. తన డబ్బులు తనకు ఎలాగైనా ఇప్పించాలని వేడుకుంది. అప్పు చేసి కట్టానని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలని కోరింది. తన లాగా వేరే వారు మోసపోకుండా తక్షణమే ఇలాంటి మోసగాళ్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేసి.. నా పదవిని కోల్పోయా! మాజీ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్