Diwali in Graveyard: దీపావళి అంటే ఇంట్లో పండుగ వాతావరణమే.. పూల అలంకారం.. ముగ్గులతో ముంగిల్లు.. కాంతులతో విరజిల్లుతుంది. టపాసులతో ఇంటి ప్రాంగణం అంతా మారుమోగ్రాల్సిందే. కానీ ఓ ఊరిలో సమాధుల వద్ద దీపావళి జరుపుకోవడం ఎప్పుడైనా చూశారా?.. పగలు శ్మశానం చూస్తేనే ఒల్లు ఝల్లు మంటుంది. ఇక రాత్రి శ్మశానం దారి నుంచి వెళ్లాలంటే ఇంక అంతే సంగతి. ఆ దారి తాటేంత వరకు ప్రాణాలు గాల్లోకే.. అలాంటిది శ్మశానంలో దీపావళి జరుపుకుంటే.. అది చూడాలంటే కరీంనగర్ లోని కార్ఖానగడ్డ కాలనీకి మీరు వెళ్లాల్సిందే. దీపావళి వచ్చే కొద్దిరోజుల ముందే అక్కడ సమాధులు రంగులద్దుకుంటాయి. శ్మశానంలోని సమాధులు రంగురంగు లైట్లతో తళుక్కుమంటుంది. సమాధుల వద్ద వున్న పిచ్చిమొక్కలు మాయమవుతాయి. దీపాల వెలుగుల్లో జాతర మొదలవుతుంది. అయితే .. దశాబ్దాలుగా కార్ఖానగడ్డ వాసులు దీపావళి వేడుకలు ఇలాగే చేసుకుంటున్నారు. తమ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డ తమ పూర్వీకులను స్మరించుకోవాలన్న ఉద్దేశంతోనే బంధువులతో పాటు శ్మశానానికి వెళ్లి తమవారి సమాధుల వద్ద దీపావళి చేసుకుంటామని వాళ్లు చెబుతారు.
Read also: Fire Accident : బెజవాడను బెంబేలెత్తిస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు
చనిపోయినవారు ఎప్పటికీ ఒంటరివారు కాదుని.. భౌతికంగా వాళ్లు దూరమైనా ఎప్పటికీ కుటుంబ సభ్యులతో ఉన్నారనే నమ్మకంతో ఇలా స్మశానంలో పండుగ చేస్తామంటున్నారు ఆఊరి ప్రజలు. శ్మశానానికి రంగులు పూసి, పూలతో ముస్తాబు చేసి ముగ్గులు వేసి చక్కగా అలంకరిస్తారు. దీపాలు పెట్టి దీపాలు పెట్టి దీపాల వెలుగులో పండుగ వాతావరణాన్ని ఆశ్వాదిస్తారు. అంతేకాదు.. మరణించిన తమ పూర్వీకులు బతికి ఉన్నప్పుడు ఏయే పదార్థాలు ఇష్టపడి తినేవారో వాటిని వండి తీసుకుని వచ్చి సమాధుల ముందు నైవేద్యంగా పెడతారు. మళ్లీ వాటిని తీసుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆతరువాత సమాధుల మధ్య టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారు. శ్మశానవాటికలో దాదాపు లక్షమందికి పైగా రావడంతో శ్మశానం సందడి వాతావరణం కనిపిస్తుంది. దీపావళి రోజు శ్మశానంలో జాతరను తలపిస్తుంది. దెయ్యాలు, భూతాలంటూ అభిప్రాయపడే వారికి ఇలాంటివి మంచి సమాధానాలు. వారుకూడా ఒకప్పుడు మనుషులే అని ఈదీపాళి ప్రతి ఒక్కరికి గుర్తు చేసుకుంటూ ఇలా జరుపుకునే పండుగను కరీంనగర్ లోని కార్ఖానగడ్డ వాసులకే చెల్లుతుంది. శ్మశానంలో పండుగ ఏంటని అందరూ ఆశ్చర్యపోయినా నిజం మాత్రం ఇదే.
No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్.. ఎక్కడ..? ఎందుకంటే..?