Karimnagar Missing Case: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన 13 ఏళ్ల వశిష్ట అనే చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ముగిసింది. గత రెండు రోజుల క్రితం నగరంలోని బైపాస్ లో అదృశ్యమయిన వశిష్ట ఆచూకీ లభ్యమైంది. గత రెండు రోజులుగా పోలీస్ బృందాలు వశిష్ట ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరం అంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు పాప ఆచూకీని కనుగొన్నారు. వశిష్ట చివరకు హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ లో వశిష్టను కనుగొన్నారు పోలీసులు. అక్కడ వశిష్టను చూసిన పోలీసులు హక్కున చేర్చుకున్నారు. వశిష్ట భయంతో ఉండటంతో మేము మీ ఇంటికి తీసుకెళతామంటూ ధైర్యం ఇవ్వడంతో వశిష్ట పోలీసుల వద్దకు వచ్చి అమ్మకావాలంటూ ఏడ్చింది. దీంతో వెంటనే పోలీసులు వశిష్ట కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు వశిష్టను హైదరాబాద్ నుండి కరీంనగర్ కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో వశిష్ట మిస్సింగ్ కేసు సుఖాంతంగా మారింది.
Read also: Pawan Kalyan: ఇవాళ కాకినాడలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన.. పార్టీ నేతలతో కీలక భేటీ
అయితే బుధవారం వశిష్ట బైపాస్ లో మిస్ అయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కు ఎలా వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వశిష్టను ఎవరైనా అక్కడకు తీసుకుని వెళ్ళారా? లేక వశిష్ట తెలియకుండా బస్సు ఎక్కి ఎంజీబీఎస్ వెళ్లిందా? అనేది ఇంకా తెలియరాలేదు. వశిష్టను మిస్ అయి ఇవాల్టితో మూడో రోజు. అయితే వశిష్ట రెండు రోజులు ఎక్కడ వుంది? ఎవరి దగ్గర ఉంది. ఒకవేళ్ల ఎవరిదగ్గర ఆ రెండు రోజులు లేకపోతే.. ఎంజీబీఎస్ ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలతో పోలీసులు సతమతమౌతున్నారు. వశిష్ట మొఖంలో భయం కనిపించడంతో ఏమీ అడలేకపోయామని, ఆ తరువాత వశిష్టను కలిసి వివరణ తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా పోలీసులు రాత్రి, పగలు అనకుండా వశిష్ట కోసం గాలించి చివరకు సేఫ్ చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించినందుకు అధికారులు అభినందించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు.
Ratan Tata: పుట్టినరోజున సంచలన నిర్ణయం.. ఈ కంపెనీకి వీడ్కోలు పలుకనున్న రతన్ టాటా