Shabbir Ali Challenges CM KCR Over Kaleshwaram Project Details: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీమంత్రి షబ్బీర్ అలీ ఓ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెల్ల పేపర్‌పై ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ కనీవినీ ఎరుగని స్థాయిలో సక్సెస్ అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన వద్దు అని నిర్ణయించుకున్నారని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని.. ఒకటి ఏ టీం అయితే, మరొకటి బి టీంని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బిజెపి వాటా తీసుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రూ.34 వేల కోట్లకు డిజైన్ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష 50 వేల కోట్లకు పెంచిందని పేర్కొన్నారు. పోడు భూములు కూడా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు 56% ఇచ్చారని చెప్పారు. ఇక్కడ గంపను, అక్కడ సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది
అంతకుముందు కూడా సీఎం కేసీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను సీఎం పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. గతంలో తెలంగాణలోని యూనివర్సిటీలు దేశంలోనే మొదటి, రెండు స్థానాల్లో ఉండేవని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లిస్టులోనే లేకుండా పోయాయని తూర్పారపట్టారు. ఉమ్మడి ఏపీలో కొట్లాడి తీసుకొచ్చిన డెయిరీ టెక్నాలజీ సొంత రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించామని.. కానీ అలా జరగలేదని మండిపడ్డారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లు కొరత ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభ బీఆర్ఎస్ నేతల్ని ఉలిక్కి పడేలా చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని.. 2004 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని, ఆ పార్టీకి రాజకీయ గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తప్పుడు వాగ్ధానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు.
Daggubati Purandeswari: షాక్‌లో ఏపీ బీజేపీ నేతలు.. పురంధేశ్వరికి బాధ్యతల వెనుక అసలు కారణం ఇదేనా..?