Kalvakuntla Kavitha: నిర్మలా సీతారామన్‌కు కవిత కౌంటర్.. వికాస్ అంటే ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిన మోడీ ప్రభుత్వం.. తెలంగాణ రుణాలపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. 2014 నాటికి రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు అది దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఈ లెక్కన.. మోడీ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిందని వివరణ ఇచ్చారు. కాబట్టి.. అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి, కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి పొంతన లేదని చెప్పారు. ఈ దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రేట్ల అధిక అప్పును మోడీ మోపారని మండిపడ్డారు. అత్యంత ధనవంతులు 3 శాతం మాత్రమే జీడీపీకి తోడ్పడుతున్నారని, మిగితా మొత్తం పేద సామన్య వ్యక్తులదేనని చెప్పారు.
Tax Survey on BBC: బీబీసీ ఐటీ రైడ్స్‌పై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా ఇచ్చిన సమాధానం ఇదే..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
8.5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించే బాధ్యత కేంద్రానికి ఉందని అన్నారు. కానీ.. వాళ్లకు ఉపాధి కల్పించకపోగా, చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేశామని నిర్మలా అంటున్నారని అన్నారు. లేనిపోని సాకుల చెప్పి.. ఉపాధి హామీ కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి, పేదల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెద్దవాళ్లకు దోచిపెట్టే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, కాబట్టి దయచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులోనూ వివక్ష చూపించిందని ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా.. కేంద్రం ఇవ్వడం లేదన్నారు. తలసరి ఆదాయాన్ని ఆర్థిక సర్వేలో వెల్లడించకపోవడం దారుణమని పేర్కొన్నారు. జనగణన ఇంకా చేయలేదని, దేశ ప్రజల వివరాలే కేంద్రం వద్ద లేవని తెలిపారు. కర్ణాటక మెట్రోతో పాటు ఉత్తరప్రదేశ్‌లో చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని కవిత నిలదీశారు.
Nirmala Sitaraman: కేసీఆర్‌పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్
కాగా.. 2014లో తెలంగాణకు రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే! భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వేయొద్దని సీరియస్ అయ్యారు కూడా! తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నెంబర్లు చూసి విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కి తెలియదని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు వాళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు బాధపడితే ఏం లాభమని నిర్మలా పేర్కొన్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ.. మెడికల్ కాలేజీల కోసం అవే జిల్లాల పేర్లు మళ్లీ పంపించారని, అందుకే తిరస్కరించి పంపించానన్నారు. ఇందుకు కౌంటర్‌గానే కవిత పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు