Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
- కాళేశ్వరంపై గ్లోబల్ ప్రాపగాండా చేస్తున్న బీఆర్ఎస్: ఉత్తమ్
- బ్యారేజీల డ్యామేజ్‌తో పంపింగ్ అసాధ్యమన్న మంత్రి
- NDSA నివేదికను విస్మరిస్తున్నారని విమర్శ
- కాగ్ నివేదికతో గత ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాలు పూర్తిగా అసత్య ప్రచారం చేస్తూ, గ్లోబల్ ప్రాపగాండాకు తెరలేపాయని మండిపడ్డారు. పదేళ్ల పాటు సాగిన గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని, వారు ఏది ముట్టినా అది నాశనమైపోయిందని ఆరోపించారు. గత పాలకులు కేవలం తమ కక్కుర్తి కోసమే ప్రాజెక్టులను కట్టారు తప్ప, రైతుల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ మీద రూ. 1 లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అందులో కాళేశ్వరం తప్ప సాధించిందేమీ లేదని, ఒక్క ఎకరా నిలకడైన నీళ్లు ఇవ్వని కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
బ్యారేజీల డ్యామేజ్ వల్లే పంపింగ్ అసాధ్యం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల వైఖరిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. గత పాలకులు పదేళ్ల పాటు ప్రాజెక్టును సక్రమంగా కట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వారి చారిత్రాత్మక తప్పిదాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నేడు ఉపయోగంలో లేకుండా పోయాయని స్పష్టం చేశారు. ఆ బ్యారేజీలలో కనీస స్థాయిలో కూడా నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ (NDSA) స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. బ్యారేజీల ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉందని, వాటిని వాడొద్దని నిపుణులు నిర్ధారించారన్నారు. ఒకవేళ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే, ఎగువన భారీ ముంపు ఏర్పడి 44 గ్రామాలతో పాటు భద్రాచలం గుడి కూడా మునిగిపోతుందని కేంద్ర అధికారులు హెచ్చరించారని వెల్లడించారు.
Also Read
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్‌బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
టెక్నికల్ సమస్యలను వివరిస్తూ ఘాటు విమర్శలు
ప్రస్తుతం గోదావరిలో నీళ్లు లేవని, వస్తున్న ప్రవాహమంతా ప్రాణహిత నది నుంచే వస్తోందని మంత్రి వివరించారు. ఈ తరుణంలో కన్నెపల్లి పంప్‌హౌస్ ఆన్ చేయాలని మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత నీళ్ల కోసం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే.. ఆ నీరంతా అన్నారం బ్యారేజీకి వెళ్తుందని, కానీ అన్నారం బ్యారేజీ ఇప్పటికే తీవ్రంగా డ్యామేజ్ అయి ఉందని పేర్కొన్నారు. అక్కడి నుండి నీళ్లు సుందిల్లకు వెళ్లాలని, కానీ ఆ రెండు బ్యారేజీలూ దెబ్బతిని ఉన్నప్పుడు నీటిని ఎలా నింపుతామని ప్రశ్నించారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఉపయోగంలో లేనప్పుడు కన్నెపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎటు వెళ్లాలో సమాధానం చెప్పాలన్నారు. “మీరు ప్రాజెక్టు సరిగ్గా కట్టి ఉంటే, మేము ఎప్పుడో కన్నెపల్లి పంపు ఆన్ చేసేవాళ్లం.. అసలు సమస్యకు కారణమే మీరు” అని దుయ్యబట్టారు.
కాగ్ నివేదిక.. లీకేజీలపై నిర్లక్ష్యం
కాళేశ్వరం ప్రాజెక్టు గనుక పూర్తి స్థాయిలో పనిచేస్తే, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎంత విద్యుత్ అవసరమో, ఒక్క ఈ ప్రాజెక్టుకే అంత పవర్ అవసరమవుతుందని ‘కాగ్’ (CAG) నివేదికలోనే స్పష్టమైందని మంత్రి గుర్తుచేశారు. మూడు బ్యారేజీలు కట్టినప్పటి నుండి లీకేజీలు, సివేజ్ సమస్యలు ఉన్నప్పటికీ అప్పటి పెద్దమనుషులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు నివేదికలు పంపినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డలో బలవంతంగా నీటి నిల్వను కొనసాగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ (NDSA) బృందం వచ్చి సమీక్ష చేసిందని, టెక్నికల్ అథారిటీ చెప్పిన నివేదికలను కూడా తప్పు పడుతున్న విపక్షాల మూర్ఖపు మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
-
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్‌కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!