K Laxman: బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తెస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman Interesting Comments On Sardar Papanna Goud: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి అని అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయం కోసం సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. దొరలు, జమీన్‌దారులు, మొగలాయిలను ఓడించిన ధీరుడు పాపన్న అని కొనియాడారు. వృత్తిని అవహేళన చేసిన, అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేశారన్నారు.
Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
బహుజన ఆత్మీయులతో చిన్నపాటి సైన్యంతో దోపిడీ పాలన అంతం చేసిన గొప్ప చరిత్రకారుడు పాపన్న అని లక్ష్మణ్ ప్రశంసించారు. మొగలాయి సైన్యంను ఓడించి.. భువనగిరి, ఓరుగల్లు, గోల్కొండ స్వాధీనం చేసుకున్న వీరుడు పాపన్న అని చెప్పారు. కుతుబ్ షాహీ, మొఘల్, నిజాం వలస పాలనను ఓడించిన వీరుడని.. అలాంటి చరిత్రను పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ బహుజన బిడ్డల చరిత్ర కనుమరుగు చేశారన్నారు. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వాళ్ల చరిత్ర కూడా చెరిపేశారన్నారు. బిర్సా ముండా, అల్లూరి లాంటి జాతీయ హీరోలను మోడీ ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేకుండా.. ఆ నలుగురికీ మాత్రమే గుర్తింపు ఇచ్చారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఆ నలుగురికి పరిమితమైన చరిత్రను.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలని కోరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము చరిత్ర కారులను వెలుగులోకి తీసుకొస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా మోగులయ్య గౌడ్‌ను గుర్తు చేసుకున్నామన్నారు. కుల వృతుల వారికి సాయంగా ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన చేశారన్నారు. శిక్షణ, ఉచిత పరికరాలతో పాటు వారికి లోన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారన్నారు. 13వేల కోట్ల రూపాయలతో 30 లక్షల కుటుంబాలకు మోడీ ఊతమిస్తున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!