K Laxman: టీఆర్ఎస్కు నూకలు చెల్లాయ్.. అందుకే బీఆర్ఎస్తో కొత్త డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman Fires On KCR New Party BRS: తెలంగాణలో టీఆర్ఎస్కు నూకలు చెల్లాయని.. అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తన ఎనిమిదేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బంగారుమయమైందని జాతీయ పత్రికలు, టీవీలకు తప్పుడు ప్రచారం చేస్తూ.. దేశ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి.. యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కేసీఆర్ కుదువ పెట్టారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.
అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా? రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? గుడి – బడి సొమ్ములను దిగమింగడం, డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? అంటూ కే లక్ష్మణ్ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతా విస్తరింపజేస్తారా? అని నిలదీశారు. దొడ్డు బియ్యం మనతో తినిపించి, సన్న బియ్యం తాను తినడం కేసీఆర్ ఆహార విధానమంటూ మండిపడ్డారు. పాఠశాలల్లో చాక్‌పీసులు ఇవ్వకపోవడం, కొన్నేళ్ల నుంచి టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా ఉండడం, యూనివర్సిటీలను నాశనం చేయడం నీ దేశ విద్యా విధానమా కేసీఆర్? అని ప్రశ్నించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
భైంసా అల్లర్లను, హైదరాబాద్‌లో తీవ్రవాద స్థావరాలను ప్రోషహించడం నీ కొత్త పార్టీ దేశ రక్షణ విధానమా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం చేతగాక తెలంగాణ ఆడబిడ్డల ప్రాణాలు తీయడమే బీఆర్ఎస్ వైద్య విధానమా? పావలా ఖర్చుతో పంటలు పండించే వీలున్న చోట రూపాయి ఖర్చుపెట్టి ప్రాజెక్ట్స్ పేరుతో దోచుకోవడమే బీఆర్ఎస్ నీటిపారుదల విధానమా? అంటూ కేసీఆర్‌ని కే లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాజకీయ పునరీకీకరణ కానే కాదని.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగుల, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేకే.. తన సొంత షోకుల కోసం ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామాలివని ఆరోపణలు చేశారు. మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజలను మళ్ళించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న విన్యాసాలు ప్రజలకు అర్థమైందని.. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని కే. లక్ష్మణ్ అన్నారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!