Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు
- డెడ్ స్టోరేజీకి చేరిన జూరాల ప్రాజెక్టు
- కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీటి కష్టాలు తీవ్రం
- నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వ ప్రయత్నాలు
- కర్ణాటకతో చర్చలు.. 5 టీఎంసీల కోసం విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కేవలం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో బావోజీ మహారాజ్‌ను దర్శించుకున్న ఆయన, అనంతరం గిరిజన సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.
దశాబ్దాల కాలంగా గిరిజనులు కలలుగన్న “మా తండాలో మా రాజ్యం” నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు గుర్తు చేశారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోని 3,100 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, విద్య , ఉద్యోగాల్లో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచడం వల్ల నేడు వేలాది మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత పదవుల్లో స్థిరపడుతున్నారని ఆయన వివరించారు.
Also Read
- Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించి ఊరూరా ఘనంగా నిర్వహించేలా చేసింది తమ ప్రభుత్వమేనని హరీష్ రావు గర్వంగా చెప్పారు. కొత్తపల్లి ప్రాంతంలో రూ. 8 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడంతో పాటు, రూ. 50 లక్షలతో బంజారా భవనాన్ని, బావోజీ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి రూ. 80 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు.
Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్
పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ 6 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా, వారికి రైతుబంధు, రైతుబీమా వంటి సౌకర్యాలను కల్పించారని హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో లంబాడాలకు కనీసం మంత్రి పదవి కూడా లేదని, గిరిజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసిందని, ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అయ్యాయని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?