Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
- భూ మాఫియా వేధిస్తోంది
- ఆత్మహత్యే శరణ్యం అంటూ వేదన
- ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ముందు ఒక సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. భూ మాఫియా తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహదేశ్ కుమార్.. భారత సైన్యంలో సైనికుడు. బీహార్‌లోని ఛప్రా నగరంలో భిఖారీ ఠాకూర్ ఆడిటోరియంలో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. వేదికపైకి సైనికుడు సహదేశ్ కుమార్ వచ్చి డిప్యూటీ సీఎం ముందు తన గోడు వెళ్లబుచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
తమ కుటుంబం భూ మాఫియా కారణంగాతీవ్ర ఇబ్బందులకు గురవుతోందని.. భూ వివాదం కారణంగా తన తండ్రి మరణించారని, ఇప్పుడు తన మామ బ్రెయిన్ హెమరేజ్‌కు గురయ్యారని చెప్పాడు. తాను మాఫియాతో పోరాడలేకపోతున్నానని.. ఎంత నిస్సహాయంగా ఉన్నానంటే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నానని తెలిపాడు. ‘‘నాకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వాళ్లకి పెళ్లి ఎలా చేయాలి? నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్?. న్యాయం జరగకపోతే అదే శరణ్యం.. మేము కోర్టుకు వెళ్లే స్థితిలో లేము. మేము పని చేయాలా లేక కోర్టుకు వెళ్లాలా? సార్?.’’ అడిగాడు.
భావోద్వేగానికి గురవుతున్న సైనికుడిని ఉప ముఖ్యమంత్రి శాంతింపజేశారు. ఆత్మహత్య పిరికితనమని అన్నారు. ‘‘నువ్వు వెళ్లిపోతే నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు ఇతరులను కాపాడితే.. నీకు న్యాయం జరుగుతుంది. మనం నేరస్థులకు భయపడితే.. వారు మనపై దాడి చేస్తారని నేను అందరికీ చెబుతాను.’’ అని అన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా.. ఈ విషయాన్ని పరిశీలించి, భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టంగా తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసి, భూమిని విడిపించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
ఇది కూడా చదవండి: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?