Junior Artist Karthik: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junior Artist Karthik: హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో దగ్గరవుతున్నాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు.
మహబూబాబాద్ జిల్లా సంకిస గ్రామానికి చెందిన కె.కార్తీక్ (18) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 13 నుంచి కనిపించకుండా పోయాడు.. 16న సోదరుడు శంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు. విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన సాయి హైదరాబాద్‌లో ఉంటూ యూట్యూబర్‌గా పనిచేసేవాడు. అతనికి జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఓ యువతి (19) పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా సాయి ప్రవర్తన యువతికి నచ్చలేదు. ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న కార్తీక్ ఆ యువతికి దగ్గరయ్యాడు. గత నెలలో వారిద్దరూ యూసుఫ్ గూడలోని కార్తీక్ సోదరుడు శంకర్ గదికి వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయి కార్తీక్‌తో గొడవ పడ్డాడు. ఆపై అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు కె.సురేష్, ఎం.రఘు, ఎన్.జగదీష్ సహాయం కోరారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
పథకం ప్రకారం కార్తీక్ ఆగస్టు 13న గదికి వెళ్లారు. ఆ యువతి దుస్తులు కొన్ని గదిలో ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని నమ్మించారు. అనంతరం కార్తీక్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పాతబోయినపల్లి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తితో కార్తీక్‌ను చెట్టుకు కట్టేసి పక్కటెముకల్లో పొడిచారు. కత్తి వంగిపోవటంతో బోర్లా పడేసి పీక కోశారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ సెల్‌ఫోన్‌ను సురేష్ ఆన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఆచూకీ వెంటనే తెలిసింది. సురేష్‌ని అదుపులోకి తీసుకోగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితులు సాయి, రఘు, జగదీష్‌లను అరెస్టు చేశారు. కార్తీక్ హత్యలో యువతి ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Viral Video : బామ్మోయ్ నువ్వు సూపర్ .. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరదీసిన బామ్మ..
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!