Road Accident: చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలూర్ గేట్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై స్కిడ్ అయి కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు సోనీ, ప్రదీప్ గా గుర్తించారు. అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గా గుర్తించారు. చేవెళ్ల నుండి హైదరాబాద్ వెళ్తుండగా బీజాపూర్ హైవే పై ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరు ఆర్య, క్రాంతిలుగా గుర్తించారు. ఇద్దరినీ చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు
పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్ట పర్యటనకు స్టూడెంట్స్ వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈరోజు ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్టూడెంట్స్ నలుగురూ.. వివిధ ఇంజినీరింగ్ కాలేజ్ లకు చెందిన స్టూడెంట్స్ గా పోలీసులు గుర్తించారు. వీరందరూ తాగిన మైకంలో కారును స్పీడ్ గా నడిపినందుకే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి కారు స్కిడ్ కావడంతో అదుపుతప్పిందని దాని వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నలుగురి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వారు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారని తెలిపారు. వారి ద్వారా ఇంకా సమాచారం బయటకు వస్తుందని తెలుస్తుందని తెలిపారు.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు