VC Sajjanar : జంప్డ్ డిపాజిట్ స్కామ్‌పై అవగాహన కల్పించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరిట జరుగుతున్న మోసాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వీసీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “జంప్డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందేశంలో భాగంగా, స్కామ్ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి. ఆ డబ్బులు చూసేందుకు బ్యాలెన్స్ చెక్ చేస్తూ పిన్ ఎంటర్ చేస్తే, మీ ఖాతా ఖాళీ అవుతుంది” అని తెలిపారు.
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
PM Modi: నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు..
యూపీఐ ఐడీ ద్వారా సైబర్ నేరగాళ్లు ఫేక్ పేమెంట్ లింకులు పంపించి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉందని, అలాంటి లింకులకు స్పందించరాదని సూచించారు. మోసానికి గురైనవారంతా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలంతా ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తమ ఖాతాల భద్రతను రక్షించుకోవాలని సజ్జనార్ స్పష్టం చేశారు.
Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!