Hyderabad: మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. స్కూల్‌కు సరిగ వెళ్లకపోవడంతో ఆమెను సోదరుడు మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక నవంబర్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: UFO: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తుతెలియని వస్తువు కలకలం.. రంగంలోకి రఫేల్
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
కేసు నమోదు అనంతరం హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు బాలికను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. వెంకటగిరిలోని బాలిక నివాసం నుంచి కేసు దర్యాప్తు చేపట్టాడు. బాలిక నివాసం వద్ద స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ ఆమె ఆటో ఎక్కినట్టు గుర్తించారు. స్థానికంగా ఉన్న 30 సీసీ కెమెరాలు వడపోయగా పోలీసులు ఆటో నెంబర్‌ను గుర్తించి డ్రైవర్‌ను విచారించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బాలికను దింపినట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో రైల్వే స్టేషన్ పరిధిలోని దాదాపు 75 సీసీ కెమెరాలు వడపోయగా ఆమె ఓ వ్యక్తితో మాట్లాడుతూ బయటకు వచ్చినట్టు గుర్తించారు. అతడితో స్కూటర్ ఎక్కి వెళ్లినట్టుగా సీసీ కెమోరాలో రికార్డు అయ్యింది. దీంతో అల్ఫా హోటల్ సమీపంలో 50 సీసీ కెమెరాలు పరిశీలించి మహాంకాళి పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కోసం స్కూటర్ ఆపినప్పుడు బండి నెంబర్‌ను కనుగొన్నారు.
Also Read: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
బైక్ నంబర్ సహాయంతో పోలీసులు ఆ వ్యక్తి అడ్రస్ తెలుసుకుని విచారించారు. అతడిని పట్టుకుని ప్రశ్నించడంతో బాలిక ఆచూకి లభ్యమైంది. రైల్వే స్టేషన్ సదరు బాలిక ఏడుస్తూ కనిపించందని, ఏమైందని అడగడంతో తాను చనిపోతానంటూ చెప్పిందన్నాడు. దీంతో ఆమెకు ధైర్యం చెప్పి జూబ్లీ బస్‌స్టేషన్ వెయిటింగ్ రూంలో ఉంచామని తెలిపాడు. బాలిక మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి ఆ మరుసటి రోజు ఆమెను మహాంకాళిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చానని అతడు పోలీసులు తెలిపాడు. దీంతో ఊపీరి పీల్చుకున్న పోలీసులు బాలిక కోసం ఆస్పత్రికి వెళ్లి ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కోసం నిద్రహరాలు మాని 5 రోజుల పాటు దాదాపు 200 సీసీ కెమెరాలు వడపోసి బాలిక ఆచూకి కనుగొన్న హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావును అందరు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!