TS Congress: 17న హైద్రాబాద్ లో కాంగ్రెస్ సభ.. సోనియా సమక్షంలో తుమ్మల, మైనంపల్లి చేరిక..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Congress: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన పెద్ద నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ సభలో ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకే వేదికపై కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని.. అదే రోజున మైనంపల్లితో పాటు ఆయన తనయుడు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. బీజేపీలో చేరిన నేతలు కూడా కేసీఆర్‌పై పోరుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17న అనూహ్య చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 21న కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్ దక్కలేదు. పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. కానీ పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఇలా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు సూచించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. అనుచరులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావుతో జరిగే సమావేశంలో క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 6 లేదా 10వ తేదీల్లో కాంగ్రెస్‌లో చేరాలని తొలుత భావించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే యూరప్ పర్యటనలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 17న తుక్కుగూడలో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు నిన్న సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ను వీడినా పార్టీలోనే కొనసాగాలని మల్కాజిగిరి నేతలు నిర్ణయించారు.
మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మెదక్ అసెంబ్లీ స్థానాల్లో రెండు సీట్లు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నారు. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలు ఇస్తే తమకేమీ ఇబ్బంది లేదని మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రతిపాదించారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు మాత్రం రెండు సీట్లు కావాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ను వీడాలని భావిస్తున్నట్లు సమాచారం. టికెట్ విషయంలో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సాధారణ అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం. పాలేరు సీటును తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అనివార్య పరిస్థితులు ఏర్పడితే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి ఖమ్మం నుంచి పోటీ చేస్తారు. లేదంటే పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Tamannah : దివ్య భారతి బయోపిక్ లో నటించబోతున్న తమన్నా..?
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!