Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ప్రస్తుతానికి నాని సమర్పణలో ఆయన ‘అలియాస్ రుక్మిణి’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబర్ నాలుగో తేదీన సినిమా రిలీజ్ కాబోతుండడంతో, నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఏమైనా ఉంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఈ విషయం మీద నిర్మాత దీప్తి గంటా స్పందించారు. ఈరోజు మీడియాతో ముచ్చటించిన ఆమె, తాజా విశేషాలను పంచుకున్నారు.
ట్రైలర్లో హీరో ‘రుక్మిణి’ అనే మారుపేరుతో అడల్ట్ (శృంగార) పుస్తకాలు రాసే రచయితగా కనిపించడంతో, సినిమాలో కూడా అలాంటి బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ వివాదాస్పద అంశంపై చిత్ర నిర్మాత దీప్తి గంటా స్పందించారు. సినిమాలో అడల్ట్ టచ్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా బదులిచ్చారు. “కథ ప్రకారం హీరో ఆ పేరుతో పుస్తకాలు ఎందుకు రాస్తాడు, అసలు ఏం రాస్తాడనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అయితే, ప్రేక్షకులకు ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా (Zero Cuts) క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది” అని దీప్తి గంటా స్పష్టం చేశారు. తద్వారా ఇది అసభ్యత లేని, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని ఆమె సంకేతాలిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
AP Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి పెట్టుబడుల జాతర.. పలు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!