ఇంజినీరింగ్ పుల్ టైమ్ పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూహెచ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2017-2021 ల మధ్య యూజీసీ నెట్, గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు వర్సటీ డీఏవో డా.వెంకటరమణారెడ్డి తెలిపారు. అక్టోబర్ 26 సాయంత్రంలోగా జేఎన్ టీయూ వెబ్ సైట్ https://jntuh.ac.in/ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి సమాచారంతో నింపి, సంబంధిత ధృవీకరణ పత్రాలతో గడువులోపు జేఎన్‌టీయూహెచ్ లో అందజేయాలని ఆయన వెల్లడించారు.