Janagama SI Srinivas: అన్యోన్యమైన కుటుంబంలో కలతలు. చిన్న చిన్న గొడవలు అతి సాధారణం. కానీ అవే చిలికి చిలికి గాలివానై ఒకరినొకరు ప్రాణాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అర్థం చేసుకునే రోజులుపోయి కాపురాల్లో కలతలు ఏర్పడి కాటికి వెళ్లే వెళ్లి పరిస్థితులు వస్తున్నాయి. చిన్న చిన్ని పాటి గొడవలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలతో భార్య భర్తల్లో ఒకరు చనిపోతే అది భరించని కొందరు తను లేని జీవితం ఎందుకని మరొకరు తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే జగనామ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్
జనగామ జిల్లాలో శ్రీనివాస్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యతో జనగామలోనే ఉంటున్నారు శ్రీనివాస్. వీరిద్దరి 27 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. వీరికి ఇద్దరు కుమారులు రవితేజ, బబ్లు ఉన్నారు. అయితే పెద్దబ్బాయికి ఆరునెల క్రితమే వివాహమైంది. రోజూ లాగానే ఉదయం లేచి భార్యతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరూ గొడవకు దిగారు. మాట మాట పెరగటంతో భరించని భార్య బయట బాత్‌రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భర్యా ఎక్కడికి వెళ్లిందో అని శ్రీనివాస్ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే బయట బాత్‌రూం తలుపులు వేసి వుండటంతో తెరిచిచూడగా షాక్ కి గురయ్యాడు. తన జీవితంలోని సగభాగం చిన్న గొడవకు కలతచెంది తనను వదిలి వెళ్లిపోయిందని భావించి బోరున ఏడ్చాడు. పోలీసులకు సమాచారం అందించాడు. అయితే తన భార్య గురించి తనే కుటుంబ సభ్యులకు ఆవార్త కన్నీరు కారుస్తూ గుండెల పగేలా చెప్పుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ భార్య లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. బాత్ రూంకి వెళ్లి వస్తానని తలుపులు వేసుకుని తన తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకున్నాడు. దీంతో పెద్ద శబ్దం రావడంతో పోలీసులు బాత్‌రూమ్ వద్దకు పరుగులు తీసారు. బాత్‌రూం తలుపులు బద్దల కొట్టి చూడగా ఎస్ఐ శ్రీనివాస్ విగతజీవిగా పడివున్నాడు. అయితే కుటుంబం కలహాల నేపథ్యంలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఎస్‌ఐ శ్రీనివాస్ మంచితననా మారేపేరంటూ తనపై ఎటువంటి ఆరోపణలు లేవని తోటి వారు కన్నీరుమున్నీరయ్యారు. ప్రతి మనిషికి కష్టాలు వుంటాయి కానీ ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందమైన జీవితం గడపాలను సూచించారు. ఎస్‌ఐ శ్రీనివాస్, భార్య మృతితో జనగామాలో తీవ్ర విషాదం అలుముకుంది.
Success Story: ఇది కదా సక్సెస్ అంటే.. డ్రైవర్ స్థాయి నుంచి ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిచ్చే స్థాయికి..