Jagtial Govt Hospital: చికిత్స కోసం భర్తుకు తోడుగా వచ్చిన వృద్ధురాలని బైటకు గెంటేశారు. ఆ వృద్ధురాలికి చేయి విరిగిందని కూడా కనికరం లేకుండా వీల్‌ఛైర్‌లో ఆసుత్రి బయట వదిలేశారు. దీంతో భార్యను వెత్తుక్కుంటూ భర్త కూడా ఆసుపత్రి బయటకు వెళ్లిపోయాడు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈఘటన కలకలం పేరుతుంది.
Read also: Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స చేయించేందుకు వారం రోజుల క్రితం భార్య మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్‌తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్గా ఉంది. బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజ నర్సుకు కేటాయించిన బెడ్ పై పడుకుంటుంది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది పేషంట్ కు మాత్రమే కేటాయించిన బెడ్ అని వృద్ధురాలి పట్ల కర్కసత్వం వహించారు. ఆమె చేయి విరిగి బాధపడుతున్న కనికరం లేకుండా వృద్ధురాలు మల్లవ్వను గురువారం వీల్ చైర్ లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట డ్రైనేజీ పక్కన రోడ్ పై వదిలి వెళ్లిపోయారు ఆసుపత్రి సిబ్బంది.
Read also: Tirumala: నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
దీంతో మల్లవ్వ విరిగిన చెయ్యితో కదలలేక అక్కడే పడుకుంది. రాజనర్సు భార్య కోసం ఆసుపత్రి అంతా గాలించి బయటకు వచ్చి చూడగా.. రోడ్డుపై డ్రైనేజీ పక్కన మల్లవ్వ కనిపించింది. దీంతో రాజనర్సు తన దగ్గరకు వచ్చి అక్కడే కూర్చున్నాడు. భర్త కోసం ఆసుపత్రికి వచ్చిన భార్య పట్ల జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కఠిన వైఖరిపై స్థానికులు ఆగ్రహం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పందించి వృద్ధులిద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై పలువురి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ సరెండర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైఖరి మారలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Fan Warning : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా..