Site icon NTV Telugu

Jagital : గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృ*తి

Heart Attack

Heart Attack

జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గుండెను పిండేసే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో, కేవలం మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిశాంత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు అందరి కళ్లముందే కుప్పకూలిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

గ్రామ సమీపంలోని పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. నిశాంత్ కూడా ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అందరితో కలిసి ఉన్న బాలుడు, అన్నదానం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అక్కడి వారు వెంటనే అప్రమత్తమై, నిశాంత్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే పరిస్థితి విషమించింది. మార్గమధ్యలోనే నిశాంత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడం, ఆసుపత్రికి చేరేలోపే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పోరండ్ల గ్రామం మూగబోయింది. చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు తలెత్తడం ఇప్పుడు తల్లిదండ్రులను , స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Exit mobile version