RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
- ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు
- గువాహటిలో తలపడనున్న రాజస్థాన్, ముంబై
- అభిమానులకు షాక్, మ్యాచ్ అనుమానమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Threat to RR vs MI in Guwahati: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ రోజు గువాహటిలో తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆర్ఆర్ హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. మరోవైపు ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించిన ఎంఐ.. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మరలా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్, ముంబై మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. మ్యాచ్‌కు రెండు గంటల ముందు (సాయంత్రం 5) స్టేడియం పరిసరాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ప్రస్తుతం పూర్తిగా మబ్బు పట్టి ఉండిఉంది. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు భారీ వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అబిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ పూర్తిగా జరగుతుందా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్!
ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా వర్షంపై అప్డేట్ ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు వర్షం ముప్పు ఎక్కువగా ఉందని చెప్పారు. గువాహటిలోని పరిస్థితులు మారకపోతే ఆటకు అంతరాయం కలగొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగే పోటీపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. యువ ఆటగాడి ప్రతిభకు, సీనియర్ బౌలింగ్‌కు మధ్య జరిగే ఈ పోరు మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి వరణుడు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికే సోమవారం కోల్‌కతా -పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!