Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, చురకలతో మార్మోగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుపై స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు చర్చకు భయపడుతున్నారని, అసెంబ్లీని తప్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని అసెంబ్లీ పెడతావా? చర్చించేది ఉంది అంటూ కోరుతుంటే, ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతా, ప్రతిపక్ష నాయకుడు రావాలి అంటున్నాడు,” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ చర్చను పక్కనపెట్టి ప్రెస్ క్లబ్‌కు, బోట్స్ క్లబ్‌కు రావాలని కేటీఆర్ పిలవడాన్ని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. “ఇంకా రెండు రోజులు గడిస్తే… కళ్లుదుకాణం దగ్గర రా అంటాడేమో కేటీఆర్,” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి స్థానంలో సెకండ్ బెంచ్ నాయకులు మాట్లాడుతుండటాన్ని కూడా జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. “కేటీఆర్, హరీష్‌రావు లాంటి నేతలు మొదటి బెంచ్‌కు చెందకుండా సెకండ్ బెంచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీలో చర్చకు రావాలంటే వీళ్లెందుకు మద్యలో వస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
Narayanpet: దారుణం.. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తని హత్య చేసిన భార్య..
కేటీఆర్, కేసీఆర్ గతంలో ఆంధ్రావారిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు వారి తీరుపై ప్రశ్నించారు. “ఆంధ్రోళ్లను తిట్టింది నువ్వే. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీయమన్నది కేసీఆర్. కానీ ఇప్పుడు నీళ్లను దొంగతనం చేసినవాళ్లను ఇంటికి పిలిచి మీటింగ్ పెడుతున్నారు,” అని జగ్గారెడ్డి విమర్శించారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పాలన కొనసాగిందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. “మా ఫోన్లు వింటూ మీరు పరిపాలించారు. ఇప్పుడు అదే మీ ఇంట్లో జరిగితే కోపం రాకుండా ఉంటుందా?” అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు, కేసీఆర్ మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తూ… “కేసీఆర్ కూడా చంద్రబాబుకే శిష్యుడు. ఇద్దరూ VH కింద యూత్ కాంగ్రెస్‌లో పనిచేశారు.
రేవంత్ మీద చంద్రబాబు కోవర్ట్ అన్న ఆరోపణల ముందు… మీ గతాన్ని కూడా గుర్తు పెట్టుకోండి,” అంటూ తేల్చి చెప్పారు. కేసీఆర్ పాలనలో చేసిన పద్ధతులకు రేవంత్ ఇంకా ఓపికగా స్పందిస్తున్నారని, ఆయన గడ్డం పట్టుకుని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చర్చ చేద్దామంటే… బయట వేదికలు ఎందుకు? అని అన్నారు.
Uddhav Thackeray: అవును మేము గుండాలమే, మా “గుండాయిజం” చూస్తూనే ఉంటారు..
